గుంటూరు: అశ్లీల వెబ్‌సైట్‌లైన Xhamlive , Cyprus ద్వారా న్యూడ్ వీడియోలను లైవ్ స్ట్రీమ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న ముఠాను ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకుంది.. వారిని విచారించిన అనంతరం వారి అరెస్ట్ చేసినట్లు ‘ఈగల్’ చీఫ్ ఆకే రవికృష్ణ వెల్లడించారు.. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “అశ్లీల వెబ్సైట్లకు నిందితులు వీడియోలను అందిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. గుంతకల్లుకు చెందిన లూయిస్ కాల్ సెంటర్ నడుపుతూ అక్కడ పనిచేస్తున్న వారితో బలవంతంగా అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నాడు. వాటిని నిషేధిత వెబ్సైట్లకు విక్రయిస్తున్నాడు. సైప్రస్ దేశానికి చెందిన సైట్ నిర్వాహకులు ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారు. లూయిస్తో పాటు శ్రీకాకుళానికి చెందిన గణేశ్, జ్యోత్స్నలను అరెస్ట్ చేశాం”అని రవికృష్ణ తెలిపారు. ఈ ముఠాపై ఇప్పటివరకు మూడు ఫిర్యాదులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఎంత మంది బాధితులు ఉన్నారనేది త్వరలోనే తెలియజేస్తామని ఐజీ రవికృష్ణ పేర్కొన్నారు.
Gunturలో లైవ్ న్యూడ్ స్ట్రీమింగ్ ముఠా అరెస్ట్
