Guntur | కుక్కల దాడిలో బాలుడు మృతి

గుంటూరు క్రైమ్ ఏప్రిల్ 6 ఆంధ్రప్రభమున్సిపల్ ఆధికారుల నిర్లక్ష్యం ఓ ముక్కు పచ్చలారని బాలుడిని బలి తీసుకుంది. ఎన్నో మార్లు వార్తాపత్రికల్లో కుక్కల బెడద గురించి ప్రస్తావించిన గుంటూరు మున్సిపల్ ఆరోగ్యశాఖ చర్యలు తీసుకోకపోవడంతో ఓ కన్న తల్లి కి కడుపు కోత ను తండ్రికి పుట్టెడు సోకాన్ని మిగిల్చింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వర్ణభారతి నగర్ లో శ్రీరామనవమి రోజున ఇంటి బయట ఆడుకుంటున్న ఐజక్ అనే 4 సంవత్సరాల బాలుడు పై వీధి కుక్కలు ఆదివారం దాడికి దిగాయి.

చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కుక్కల్ని తోలి రక్తపు మడుగులో ఉన్న బాలుడును ఉరుకుల పరుగులమీద జి జి హెచ్ కు తరలించారు. మెడపై బలమైన గాయాలు అవ్వడం తో వైద్యం తీసుకుంటూ బాలుడు మృతి చెందాడు.

ఈ ఘటనపై బాలుడు తండ్రి నాగరాజు తల్లి రాణి మాట్లాడుతూ ఇప్పటికే మున్సిపల్ అధికారులకు కుక్కల బెడద గురించిి ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని నగరంలో పట్టిన వీధి కుక్కలను తమ నివాసాల్లో వదలడం వల్లే తన కొడుకు ఈ గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనికి బాధ్యులైన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమ కొడుకు మృతదేహానికి పోస్టుమార్టం వద్దని మృతదేహాన్ని తమకు అప్పగించవలసిందిగా జిజిహెచ్ ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply