gunfire | రూ.6లక్షలు ఎత్తుకెళ్లారు

gunfire | రూ.6లక్షలు ఎత్తుకెళ్లారు
- ఒకరికి గాయాలు
gunfire | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులు రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు. ఘటనలో రిషద్ కాలికి తూటా గాయమైంది. అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. ఘటనాస్థలిలో సీసీటీవీ ఫుటేజీని సుల్తాన్ బజార్ పోలీసులు పరిశీలిస్తున్నారు.

బైకుపై వచ్చిన ఇద్దరు దుండుగులు కాల్పులు జరిపి డబ్బు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు రిషద్‌ను నాంపల్లిలోని వస్త్ర వ్యాపారిగా గుర్తించారు. ఘటనాస్థలిని డీసీసీ శిల్పవల్లి పరిశీలించారు. క్లూస్ టీమ్స్ ఇప్పటికే ప్రాథమిక వివరాలు సేకరించినట్లు తెలిపారు.

