ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

ఆంధ్రప్రభ, ప్రతినిధి / యాదాద్రి : రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) పని చేస్తుందని ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (MLA Beerla Ilayya)అన్నారు. శుక్రవారం జనగాం జిల్లా (Jangaon district)లోని నవాబుపేట రిజర్వాయర్ (Nawabpet reservoir) నుండి ఆలేరు నియోజకవర్గం(Aleru constituency)లోని గుండాల మండలానికి భువనగిరి ఎంపీ (Bhuvanagiri MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి (MLAs Kadiyam Srihari), యశస్విని రెడ్డి తో కలసి నీటిని విడుదల చేసారు.

ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య గేటు తిప్పి గుండాల మండలానికి నీటిని విడుదల చేసి, గుండాల వైపు వెళ్తున్న గంగమ్మ తల్లికి పువ్వులు,కుంకుమ్మ పసుపు,సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.

Leave a Reply