అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పోరాడుతోంది. టైటాన్స్ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు రోహిత్ శర్మ (8), ర్యాన్ రికెల్టన్ (6) నిరాశపరిచారు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కలిసి జట్టు స్కోర్ బోర్దును ముందుకు కదిలిస్తున్నారు.
తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (30 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్సుతో 37), సూర్యకుమార్ యాదవ్ (17బంతుల్లో 1ఫోర్లు, 2 సిక్సుతో 29) మంచి ఫామ్ కనబరుస్తూ.. గుజరాత్ బంతులను బౌండరీలుగా మారుస్తున్నారు. వీరిద్దరి భాగస్వామ్యంలో మూడో వికెట్ కు 33 బంతుల్లో 51 పరుగులు జోడించారు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి ముంబై జట్టు స్కోర్ బోర్డుపై 86 పరుగులు నమోదు చేశారు.
కాగా, ముంబై విజయానికి 58 బంతుల్లో 109 పరుగులు కావాల్సి ఉంది.