రైతులకే లాభం

రైతులకే లాభం

  • ట్రాక్టర్ ర్యాలీలో నంద్యాల జేసీ

(నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో) : కేంద్ర ప్రభుత్వం ట్రాక్టర్, పరికరాల, వ్యవసాయ యంత్ర పరికరాలు, సూక్ష్మ పోషకాలు, బయో పెస్టి సైడ్స్, స్ప్రింక్లర్, డ్రిప్ పరికరాలు, డీజిల్ ఇంజిన్ల పై జీఎస్టీ 12శాతం నుంచి 5 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించిదని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ (Joint Collector C. Vishnu Charan) అన్నారు. నంద్యాల (Nandyala) లో బుధవారం జీఎస్టీపై రైతులకు అవగాహన కల్పించే ర్యాలీని నిర్వహించారు.

ఈ ర్యాలీలో వ్యవసాయ సిబ్బంది, రైతులు (Farmers) పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని పలు వీధుల్లో ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… సాంకేతిక విప్లవం వైపు వ్యవసాయ శాఖ (Agriculture Department) అడుగులు వేస్తుందన్నారు. జిల్లాలోని అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో ఈ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మద్దిలేటి, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ నాగరాజు, మండల వ్యవసాయ అధికారి ప్రసాద రావు, వ్యవసాయ అధికారి ఆయుబ్ బాషా, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply