సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ..

జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీం జిల్లా జైనూర్ మండలంలోని బూసిమెట్ట పంచాయతీలోని బూసిమెట్ట క్యాంపు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శనివారం బూసిమెట్ట పంచాయతీ సర్పంచ్ ఆత్రం సింధు నగేష్, భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని పనులు త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్ కోరారు. పంచాయతీలో అభివృద్ధి పనులు చేపడతానని ఏ సమస్యలున్నపరిష్కరించేందుకు కృషి చేస్తానని సర్పంచ్ సింధు నగేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆత్రం సింధునగేష్, కారోబారి కేజురావు, గ్రామ పటేల్ గోటేకర్ మారుతీ,గ్రామ పెద్దలుపాల్గొన్నారు.
