సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ..

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ..

కుంటాల, ఆంధ్రప్రభ : ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా మంజూరైన 22 నిధులతో అంబకంటి తండా గ్రామాల మధ్య సర్పంచులు ముజ్జిగే రాణి ప్రదీప్ కుమార్, జాదవ్ జ్యోతిబాయి, హరిలాల్ లు కలిసి సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలకు కృషి చేస్తామని పేర్కొన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలియజేశారు. గ్రామాల అభివృద్ధికి అధికారుల కృషితో అభివృద్ధికి దోహదపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ఎంఏ అబ్దుల్ రహీం, మాజీ సర్పంచ్ జాదవ్, శంకర్, సీనియర్ పిప్పెర వెంగళరావు, మాజీ ఎంపిటిసి సుధాకర్, సుభాష్, పంచాయతీ కార్యదర్శులు సతీష్, సుమన్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply