న్యూ డిల్లీ – తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ర్టపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు..! ఈ యువ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, ఆర్థిక, సాంకేతిక అభివృద్ధి యొక్క శక్తివంతమైన ఆధునిక పరిణామాన్ని కలిగి ఉంది. తెలంగాణ ప్రజలు పురోగతి మరియు సమృద్ధి మార్గంలో ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నా’ అంటూ ప్రెసిడెంట్ ద్రౌపది తెలంగాణ ప్రజలకు విషెస్ చెప్పారు.
రాష్ట్ర ప్రజలకు విజయాలు, సంపదలు…
. ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. జాతీయ పురోగతికి అవిరళమైన కృషి చేసినందుకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది. గత దశాబ్దంలో, రాష్ట్ర ప్రజల ‘జీవన సౌలభ్యాన్ని’ పెంచడానికి ఎన్డీఎ సర్కార్ అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రజలకు విజయాలు, సంపదలు కలిగేలా ఆశీర్వాదాలు లభించాలని కోరుకుంటున్నా’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.