ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు

ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్

కృష్ణ లంక, ఆంధ్ర ప్రభ : మత సామరస్యాన్ని పెంపొందించి ఐక్యతను చాటే పర్వదినం పవిత్ర రంజాన్ అని, రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ,నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి అల్లాహ్‌కు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా ఆ అల్లాహ్ అనుగ్రహించాలని ఆకాంక్షించారు.

వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాజీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి దే అని అన్నారు.మరలా ముఖ్యమంత్రి కావాలని,రాష్ట్రం లో మరో మారు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా అల్లాహ్ దీవెనలు అందించాలని అవినాష్ కోరుకున్నారు.

Leave a Reply