Greet with Green | పూలదండలు వద్దు..
Greet with Green | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నూతన సంవత్సర వేడుకలను మొక్కల ద్వారా విద్యాసామాగ్రి ద్వారా జరుపుకుందామని మంత్రి ఫరూక్, పార్లమెంటు సభ్యురాలు, డాక్టర్ బైరెడ్డి, శబరి జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ ల కార్యాలయాలలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గ్రీట్ విత్ గ్రీన్ అనే పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బొకేలు, పూల దండలు కాకుండా మొక్కల ద్వారా విద్యాసామాగ్రి ద్వారా మాత్రమే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు. సేకరించిన మొక్కలను జూనియర్, యూత్ రెడ్ క్రాస్ ద్వారా ప్రభుత్వ విద్యా సంస్థలలో నాటించడం జరుగుతుందన్నారు. అలాగే విద్యాసామాగ్రిని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులకు అందజేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల, రెడ్ క్రాస్ జిల్లా సెక్రెటరీ, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, రెడ్ క్రాస్ జిల్లా ఎక్స్ అఫీషియో మెంబర్, మాజీ వైస్ చైర్మన్ రెంటాల మారుతి కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్ భాష తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బొమ్మల సత్రం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా మొక్కలు స్టేషనరీ స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

