హైదరాబాద్ : భారతదేశ డిజిటల్ విప్లవానికి మరో ముందడుగు పడింది. ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని స్టార్‌లింక్, దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అన్ని కీలక అనుమతులు పొందింది. కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయం అధికారికంగా ప్రకటించారు.
దేశంలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఇది వినూత్న మైలురాయిగా భావిస్తున్నారు. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో భారతదేశంలో అందుబాటులోకి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.