Great success | ఇంటింటా ప్రచారం

Great success | ఇంటింటా ప్రచారం

Great success | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి ఏకు మనోహర్‌కు మద్దతు పెంచేందుకు ఈ రోజు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పరకాల పట్టణ మహిళా అధ్యక్షురాలు గంట కళావతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఉంగరం గుర్తుకు ఓటు వేసి మనోహర్‌ను ఘన విజయం(Great success) సాధింపజేయాలని కోరారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ పరిపాలనలో పరకాల నియోజకవర్గం ఎదిగిన అభివృద్ధి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి(MLA Challa Dharma Reddy) చేసిన సేవలను ప్రజలు స్మరించుకోవాలన్నారు. గ్రామాభివృద్ధి కొనసాగాలంటే బీఆర్‌ఎస్ అభ్యర్థికి విజయం చేకూర్చాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply