అనకాపల్లి, ఆగస్టు 5(ఆంధ్రప్రభ ) : హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్రాన్యూల్స్ (Pharmaceutical company granules) ఇండియా లిమిటెడ్, పరవాడలో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన బీసీ ప్రభుత్వ బాలుర వసతి గృహం (BC Government Boys’ Dormitory) ను ప్రారంభించింది. తద్వారా బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లల విద్యా వసతులను మెరుగు పరచడం పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. అనకాపల్లి (Anakapalle), విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలకు చెందిన పలు గ్రామాలలోని పేద కుటుంబాలకు చెందిన 100మందికి పైగా విద్యార్థులకు ఈ కార్యక్రమం ప్రయోజనం చేకూరుస్తుంది, తమ విద్యను కొనసాగించడానికి వారికి అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా (ఆంధ్రప్రదేశ్ ) కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ విజయ కృష్ణన్, ఐఏఎస్, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమా చిగురుపాటి, ఇతర కీలక ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమా చిగురుపాటి (Uma Chigurupati) మాట్లాడుతూ… గ్రాన్యూల్స్ వద్ద తాము సమ్మిళిత పురోగతికి విద్య అత్యంత కీలకమని భావిస్తున్నామన్నారు. ఈ వసతి గృహంలో మెరుగైన సదుపాయాలను కల్పించటం ద్వారా, విద్యాపరమైన దృష్టి, ఆత్మవిశ్వాసం రెండింటినీ పెంపొందించే సురక్షితమైన, గౌరవప్రదమైన ప్రాంగణాన్ని మేము సృష్టించాము. ఆరోగ్యకరమైన, మరింత సాధికారత కలిగిన సమాజాలను నిర్మించాలనే మా ప్రయత్నంలో ఈ కార్యక్రమం చిన్నదే అయినప్పటికీ అర్థవంతమైన ముందడుగన్నారు. ఈ కార్యక్రమం తాము సేవలందించే సమాజాల్లో స్థిరమైన ప్రభావాన్ని చూపే గ్రాన్యూల్స్ ఇండియా (Granules India) విస్తృత సీఎస్ఆర్ లక్ష్యంను ప్రతిబింబిస్తుందన్నారు.
