Loans| వడ్డీ లేని రుణాలు మంజూరు..

Loans| బోధన్, ఆంధ్రప్రభ: మహిళలను మరింత ఆర్థికంగా బలోపేతం చేయడానికి వీలుగా పథకాలు అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం బోధన్ పట్టణంలో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందజేశారు. బోధన్ మండలంలోని వివిధ మహిళా సంఘాలకు రూ. 4 కోట్ల 28 లక్షల వడ్డీలు లేని రుణాలను సబ్ కలెక్టర్ వికాస్ మహాతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలకు మరింత ఆర్థిక స్వేచ్ఛ లభించేలా చూడడానికి స్వయం ఉపాధి పథకాలను బలోపేతం చేస్తున్నామన్నారు. సోలార్ ప్లాంట్లు పెట్రోల్ పంపులు ఏర్పాటు చేసుకునే విధంగా సహకార అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో బోధన్ తహసిల్దార్ విట్టల్, ఇందిరా క్రాంతి పథకం జిల్లా అధికారులు మండల మహిళా సమాఖ్య సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
