ఆలయ మర్యాదలతో ఘన స్వాగం..

ఆంధ్రప్రభ, ఏర్పేడు (తిరుపతి జిల్లా) : గుడిమల్లన్న ఆలయానికి నూతనంగా ఏర్పాటు చేసిన బైపాస్ మార్గానికి సిమెంటు రోడ్డు మంజూరు చేయాలని గుడిమల్లం ఆలయ ఈవో కె. రామచంద్రారెడ్డి, మాజీ చైర్మన్ బత్తల గిరి నాయుడులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ను అభ్యర్థించారు.

జిల్లా కలెక్టర్ ను శ్రీ పరశు రామస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ బత్తలగిరి నాయుడు, కార్యనిర్వాహణాధికారి రామచంద్ర రెడ్డి ఘనంగా సన్మానించారు. ఆలయానికి నూతనంగా నిర్మించిన బైపాస్ రోడ్డునకు సిమెంట్ రోడ్డు కొరకు కలెక్టర్ కు అర్జీ సమర్పించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి జనవరి నెలలో రోడ్డుపని చేయిస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా నూతన అన్నదానం షెడ్డు ( తాత్కాలిక షెడ్డు) కొరకు తగిన ప్రతిపాదనను కలెక్టర్ ద్వారా స్టేట్ ఆర్కియాలజీ శాఖ కమిషనర్ కి పంపుతామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

Leave a Reply