ఘనంగా క్రికెట్ పోటీలు..

ఘనంగా క్రికెట్ పోటీలు..
-5 రోజుల పాటు 4 మండలాల్లో క్రికెట్ పోటీలు
-ఎస్ఐ సోమేశ్వర్ చేతుల మీదుగా బహుమతులు అందజేత..
ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ముత్తాపురం గ్రామంలో 5 రోజుల పాటు నాలుగు మండలాలు ఆళ్లపల్లి, టేకులపల్లి, గుండాల, భద్రాద్రి కొత్తగూడెం మండలాల స్థాయి క్రికెట్ పోటీలను గుండాల మండలానికి చెందిన శ్రీలక్ష్మి ఫెర్టిలైజర్ మాడే మంగయ్య, ఇప్పనపల్లి గ్రామానికి చెందిన శ్రీ వర్షిని ట్రేడర్స్ జారే భాస్కర్ వ్యాపారవర్గం ప్రొప్రైటర్ ఆధ్వర్యంలో ఘనంగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ క్రీడలను యువజన నాయకులు యూత్ కిరణ్ కోటి సమక్షంలో 5 రోజుల పాటుగా నిర్వహించారు. ఈ క్రీడలకు బహుమతులను స్థానిక ఎస్ఐ ముత్తినేని సోమేశ్వర్ చేతుల మీదుగా అందజేయడం జరిగిందని జారే భాస్కర్ తెలిపారు.
అనంతరం ఎస్ఐ సోమేశ్వర్ మాట్లాడుతూ.. క్రీడలు స్నేహపూర్వకంగా ఆడాలని గెలుపోటములు సహజమనీ, విద్యతో పాటుగా క్రీడల్లోనూ రాణించాలని, ఉన్నత విద్యను అభ్యసించి మంచి ప్రయోజకులు కావాలని క్రీడాకారులకు సూచించారు. అనంతరం జారే భాస్కర్ మాట్లాడుతూ.. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని యువతకు క్రీడలతో ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ క్రీడలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆదివాసి యూత్ విద్యతో పాటు క్రీడల్లోనూ గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు క్రీడల్లో వారికున్న నైపుణ్యతను ప్రతిభను కనపరచాలి. తమవంతుగా వారికి కొంత ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తూ, ప్రోత్సాహించాలని.. వ్యాపారవర్గాలు అధికారులు, నాయకులు నిలవాలని విజ్ఞప్తి చేశారు.
గిరిజన యువతీ యువకులు పెడద్రోవన పడకుండా, చెడు వ్యసనాలకు బానిస కాకుండా, సన్మార్గంలో నడుస్తూ తల్లిదండ్రులకు గ్రామానికి మండలానికి మంచి పేరు తీసుకురావాలని తల్లిదండ్రులు ఆశయాలు నెరవేర్చాలని వారు విజ్ఞప్తి చేశారు. యువకుడు పాయం కిరణ్ కోటి ఆధ్వర్యంలో క్రీడాకారులను చక్కటి వాతావరణంలో క్రీడలను ఆడించడంలో, మౌలిక సౌకర్యాలు సమకూర్చడంలో తమ వంతు కృషి చేయడం అభినందనీయమన్నారు.
అనంతరం స్థానిక ఎస్ఐ సోమేశ్వర్, మాడే మంగయ్య, జారే భాస్కర్ చేతుల మీదుగా ప్రథమ బహుమతి గుండాల మండలంలోని శ్రీలక్ష్మి ఫెర్టిలైజర్ 20000 వేలు, షీల్డ్, ద్వితీయ బహుమతి శ్రీ వర్షిని ట్రేడర్స్ జారే భాస్కర్ టీం 14000 షీల్డ్, తృతీయ బహుమతి రాయపాడు గ్రామానికి చెందిన పెండకట్ల హరిబాబూ టీమ్ సభ్యులకు 5000, షీల్డ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాపార వర్గాలు నువ్వుల నరసింహారావు, కందాల ఉపేందర్, వెంకటాద్రి, సెక్రెటరీ వరుణ్, సర్పంచి ఊకే చిన్నపాపయ్య, దొర పటేల్, గ్రామస్తులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
