ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై గ్రామ సభ సమావేశం

లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండలంలోని చామన్ పెల్లి గ్రామంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా శనివారం గ్రామ సభ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో గ్రామం లోని సమస్యల పై చరించారు ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. స్వయం సహాయక సంఘం సభ్యులతో మాట్లాడి సమస్యల గురించి చర్చించారు. పచ్చదనం పరిశుభ్రత కొరకు కృషి చేయాలి అని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమం లో చామన్ పల్లి సర్పంచ్ లక్ష్మి సుదర్శన్,ఉప సర్పంచ్ గంగారెడ్డి, ఎంపీడీఓ రాధ పంచాయతీ కార్యదర్శి, వార్డ్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
