పొలాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టాలి..
నంగునూర్, ఆంధ్రప్రభ : కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించుకోవాలని పాలమాకుల పీఏసీయస్(PACUS) చైర్మన్ ఎల్లంకి మైపాల్ రెడ్డి అన్నారు. నంగునూర్ మండల పరిధిలోని జేపీ తండా గ్రామంలో ఈ రోజు పీఏసీయస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ ఎల్లంకి మైపాల్ రెడ్డి(Ellanki Maipal Reddy) ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతు తమ వ్యవసాయ(Agric) పొలాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతనే సెంటర్లకు తీసుకురావాలనీ, వరి కొనుగోలు కేంద్రాన్ని గ్రామంలో ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.