Govt | రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

Govt | రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
- తహసీల్దార్ బి.విజయప్రసాద్
Govt | ఘంటసాల, ఆంధ్రప్రభ : రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగానే రీ సర్వే నిర్వహించిన ఘంటసాల మండలంలోని మూడు గ్రామాల రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తున్నట్టు తహసీల్దార్ బి.విజయప్రసాద్ తెలిపారు. ఘంటసాల మండల పరిధిలోని దేవరకోట గ్రామంలో ఇవాళ రీ సర్వే గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బిరుదుగడ్డకు వచ్చిన 125, ఎలికలకుదురుకు వచ్చిన 96 పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మద్దాల వెంకటేశ్వరరావు, రీ సర్వే డిటి శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి కాంతారావు, గ్రామ ప్రముఖులు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.
