20 గుంటల స్థలాన్ని ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవాలి

20 గుంటల స్థలాన్ని ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవాలి

జగిత్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ ప్రతి ఒక్కరీ బాధ్యత అని, యాజమాన్య హక్కులు(Ownership rights) లేకుండా రూ.100 కోట్ల ఆస్తి కబ్జాకు గురైంద‌ని, పెట్రోల్ పంపు కోసం కేటాయిస్తే.. వారసత్వ ఆస్తిగా పంపకాలు చేశారని మాజీ మంత్రి టి.జీవ‌న్ రెడ్డి అన్నారు.

ఈ రోజు ఇందిరా భ‌వ‌న్‌(Indira Bhavan)లో విలేక‌రుల‌తో మాట్లాడారు. అక్రమంగా వినియోగిస్తున్న 20 గుంటల స్థలాన్ని మున్సిపల్ స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఆ స్థలాన్ని ప్రజావసరాలకు వినియోగించాలన్నారు.

పట్టణంలో యావర్ రోడ్డు విస్తరణ ప్రధానమని, 1994 లో మాస్టర్ ప్లాన్(Master Plan) అమలుకోసం రోడ్డు 60 ఫీట్లు వరకు ఆమోదం పొందగా, సహజంగా భూసేకరణ చేస్తే నిజమైన యాజమాన్య హక్కులు ఉంటే, పరిహారం చెల్లించాలన్నారు. రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న వారిని బుజ్జగించి, ఒప్పించి, మెప్పించి 60 ఫీట్ల వరకు విస్తరించామని తెలిపారు.

100 ఫీట్ల రోడ్డు(100 Feet Road) విస్తరణ కోసం మునిసిపల్ లో ప్రతిపాదనలు చేసినా అప్పటి ప్రభుత్వ పాలనలో అమలుకు నోచుకోలేదని, అనంతరం మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందిందని, న్యూ బస్టాండ్ వద్ద 1952 ప్రాంతంలో పెట్రోల్, డీజిల్( Petrol, Diesel), దుకాణం లేకపోవడం తో ప్రజా అవసరాల కోసం దారం వీర మల్లయ్య కు 20 గుంటల భూమిని మున్సిపల్ కేటాయించిందని వివ‌రించారు.

కేవలం పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఔట్లెట్(Kerosene Outlet) ఏర్పాటు చేయడం కోసం కేటాయించారని, పెట్రోల్ బంక్ కేవలం నాలుగు గుంట‌లు మాత్రమే ఉపయోగిస్తున్నారని తెలిపారు. సహజంగా మున్సిపాలిటీ ప్రభుత్వ అనుమతి లేకుండ భూమి కేటాయించరాదని, ప్రభుత్వ అనుమతి పొందినట్టు ఏవిధమైన ఆధారం లేదని, మున్సిపల్ కౌన్సెల్(Municipal Counsel) చేసిన తీర్మానం ఇప్పటికీ అమల్లో ఉందని, దారం వీర మల్లయ్య వారసులు యాజమాన్య హక్కులు ధృవీకరించుకోలేదని వివ‌రించారు.

యాజమాన్య హక్కుల ధృవీకరణ కోసం కోర్టు కక్షిదారులకు సూచనలు చేసిందని, కోర్టు తీర్పు వచ్చి 16 సంవత్సరాలు అవుతుందని, ఇప్పటి వరకు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్ర‌శ్నించారు. పట్టణంలో రోడ్డు విస్తరణ లో పెట్రోల్ బంక్(Petrol Bunk) జనరేటర్ ప్రధాన ఆటంకంగా మారిందని, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ కోసం కేటాయించిన భూమిని ఇతర అవసరాలకు వినియోగించడం చట్టపరంగా చెల్లదన్నారు.

నిజంగా యాజమాన్య హక్కులు ఉంటే కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించారు. జగిత్యాల(Jagityala) పట్టణంలోని మున్సిపాలిటీకి చెందిన సర్వే నంబర్ 138 లో ఏవిధమైన యాజమాన్య హక్కులు లేకుండా అక్రమ స్వాధీనంలో ఉన్న ఆస్తులను మున్సిపల్ స్వాధీనం చేసుకోవాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ డైరెక్టర్(Municipal Director), జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కు లేఖలు రాస్తామన్నారు.

Leave a Reply