Govt | బీఆర్ ఎస్, సీపీఎం అభ్యర్థులను గెలిపించాలి

Govt | బీఆర్ ఎస్, సీపీఎం అభ్యర్థులను గెలిపించాలి
Govt | మోత్కూర్, ఆంధ్రప్రభ : 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామిలిచ్చి అధికారంలోకి వచ్చి,నేడు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రెండేళ్ల నుంచి మాయ మాటలు చెబుతూ కాలం వెల్లదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధం తో బుద్ది చెప్పాలని, బి ఆర్ ఎస్, సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు, మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్ డాక్టర్ నేవూరి ధర్మేంధర్ రెడ్డి అన్నారు.
మంగళవారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో బీ ఆర్ ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో 6 గ్యారెంటీ లు,420 హామీలిచ్చి నేడు ఒక్క హామీ అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు. బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు,కార్యక్రమాలు అమలు చేయకపోగా అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి ఐనా ఒక్క కొత్త పథకం అమలు చేయలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమమైనా, పబ్లిక్ మీటింగ్ ఐనా తెలంగాణ జాతి పిత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని,కె సి ఆర్ ను తిట్టక పోతే రేవంత్ రెడ్డి కి పూ ట గడవటం లేదన్నారు.
బీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు, రైతు భీమా ఆలస్యం జరగలేదని,కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల లో రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిందన్నారు.బీ ఆర్ ఎస్ హయాంలో పేద ,మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలని కె జి టు పి జి ,గురుకులాలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ హయాంలో గురుకులాల ను నిర్వీర్యం చేస్తుందన్నారు. కళ్యాణ లక్ష్మీ లక్ష తో పాటు తులం బంగారం ఇస్తామని నేటికి ఒక్కరికి ఇవ్వలేదని, పెన్షన్ 4 వేలు ఇస్తామని నేటి వరకు పాత పెన్షన్ ఇస్తున్నారని, మహిళలకు నెలకు రూ.2500 ఊసే ఎత్తడం లేదన్నారు.
అలవి కానీ హామిలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ది చెప్పాలని, బీ ఆర్ ఎస్,సీపీఎం అభ్యర్థుల కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీ ఆర్ ఎస్ హయాంలో నే మోత్కూర్ ను మున్సిపాలిటీ చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని తెలిపారు.11 వార్డులలో బీ ఆర్ ఎస్,8 వ వార్డులో సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఈ సమావేశంలో మార్కెట్ మాజీ ఛైర్మన్ తీపిరెడ్డి మేఘారెడ్డి, బీ ఆర్ ఎస్ మండల అధ్యక్షులు పొన్నెబొయిన రమేష్,కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్,సీపీఎం నాయకులు,సీపీఎం నాయకులు చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్, నాయకులు తాటి లక్ష్మణ్ లు పాల్గొన్నారు.
