అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం…

అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం…
పాయకాపురం, ఆంధ్ర ప్రభ : అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.సింగ్ నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, సూపర్వైజర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిందిని అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో తొలిసారిగా రెండు సార్లు అంగన్వాడీ వేతనాలను పెంచిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు. అంగన్వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తూ రూ.86.68 లక్షలు విడుదల చేసి ప్రతి కేంద్రానికి ప్రత్యేక నిధులు కేటాయించిందని తెలిపారు.ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించే విధానాన్ని అమలు చేస్తూ జీతాల ఆలస్యానికి శాశ్వత చెక్ పెట్టిందని పేర్కొన్నారు.
58,204 మంది అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు రూ.75 కోట్ల వ్యయంతో 5జి స్మార్ట్ఫోన్లు అందజేసి సేవలను మరింత వేగవంతం చేసిందని తెలిపారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కష్టమోహన్ పాల్గొన్నారు.
