Government | గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం

Government | గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం
Government | రామన్నపేట, ఆంధ్రప్రభ : సిరిపురం గ్రామ సర్పంచ్‌గా ఒకసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని బీజేపీ పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి(Upendra Ravinder Reddy) అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.
ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథం(Development Path)లో తీసుకెళ్తామన్నారు. ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి సేవ చేయడానికి తాను ముందుంటానని వారు పేర్కొన్నారు. జీపీ పరిధిలోని సమస్యలను ప్రభుత్వ అధికారు(Government Official)ల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని ఎల్లప్పుడు తాను ప్రజలకు ఓటర్లకు రుణపడి ఉంటానని వారు తెలిపారు.
