కడెం, ఏప్రిల్ 12 ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం కడెం మండలంలోని మాసాయిపెట్ గ్రామంలో హనుమాన్ ఆలయం చుట్టూ 6లక్షల పైచిలుకు నిధులతో నిర్మించనున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలను అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం పాటు పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగెల భూమన్న భూషణ్, ఆలయ కమిటీ చైర్మన్ కె.దినకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పొద్దుటూరి సతీష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ కడెం మండల అధ్యక్షుడు రెంకల శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తక్కళ్ళ సత్తన్న, ఆకుల లచ్చన్న, కోల శ్రీనివాస్, కె రాజేష్, మార్కాపు లక్ష్మణ్ రాజు, ఆలయ కమిటీ సభ్యులు అంజన్న స్వామి, మాలదారులు, తదితరులు పాల్గొన్నారు.