government | అభివృద్ధి చేస్తాను.. ఓటు వేసి గెలిపించండి…
government | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : దండు మల్కాపురం గ్రామ అభివృద్ధి కోసం ఈ నెల 17న జరిగే ఎన్నికలలో తనను సర్పంచ్ గా గెలిపించాలని కోరుతూ మాజీ ఎంపీటీసీ ఈడుదుల పాండరి రాజకీయ వారసుడు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న ఈడుదుల మస్తాన్ బాబు ఈ రోజు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ ఎంపీటీసీ సభ్యులుగా మా నాన్న ఈడుదుల పాండరి ఎంతో కృషి చేశారని, ఆయన వారసునిగా గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించి(solve) ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్ గా తనకు అవకాశం కల్పించాలని ఈడుదుల పాండరి కొడుకు ఈడుదుల మస్తాన్ బాబు కోరారు.
సర్పంచ్ గా గెలిపిస్తే ప్రభుత్వ పథకాల(government schemes)ను ప్రజలకు అందించడంతో పాటు మునుగోడు అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గ్రామంలో చేయబోయే అభివృద్ధి పనులను గ్రామ ప్రజలకు ఇంటింటికి తిరిగి వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా అధికార పార్టీ మద్దతు ఉన్న మస్తాన్ బాబును సర్పంచిగా గెలిపిస్తేనే గ్రామం అభివృద్ధి(village development) చెందుతుందని, సమస్యలు పరిష్కారం అవుతాయని గ్రామ ప్రజలు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రచార కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

