Government | చంద్రబాబు ఆదేశాలతో…

Government | చంద్రబాబు ఆదేశాలతో…

  • పార్టీ కోసం నిబద్ధత అంకితభావం ముఖ్యం..
  • ఎన్టీఆర్ సిద్ధాంతాలు అలవాటు చేసుకోవాలి..
  • ప్రజలతో బలమైన సంబంధం అవసరం..
  • అభివృద్ధి సంక్షేమం వివరించాలి…
  • ప్రతిపక్ష విష ప్రచారాలను తిప్పి కొట్టాలి..
  • టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ తరగతులు..

Government | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : నాలుగున్నర దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ పై నిబద్ధత అంకితభావం ఎంతో ముఖ్యమని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, కేడీసీసీ చైర్మన్(KDCC Chairman) నెట్టెం రఘురాం వ్యాఖ్యానించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు సిద్ధాంతాలను అలవాటు చేసుకోవాలన్న ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రతిపక్ష పార్టీ విష ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు.

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆదేశాలతో, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) నాయకత్వంలో మండల పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణా తరగతుల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ గురువారం పాల్గొని దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ.. గ్రామ, మండల స్థాయి పార్టీ అధ్యక్షులు భవిష్యత్తులో రాష్ట్రస్థాయి నాయకులుగా ఎదగాలనేదే తెలుగుదేశం(Telugu Desam) పార్టీ సిద్ధాంతం, విధానం అని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపకులు, మహానేత నందమూరి తారక రామారావు నాటిన ఆశయాలను కొనసాగిస్తూ, నేటి పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతోందని అన్నారు.

పార్టీ కోసం నిబద్ధతతో, అంకితభావంతో కష్టపడి పని చేస్తేనే ప్రజల మనస్సులు గెలుచుకోవచ్చని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలతో బలమైన అనుబంధం ఏర్పరుచుకోవడం అత్యంత అవసరమని, పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమంలో క్రియాశీలకంగా పాల్గొనాలని సూచించారు.

అదే విధంగా, ప్రస్తుతం మనం సైకోతో పోరాడుతున్నామనే విషయాన్ని ప్రతి కార్యకర్త గుర్తుంచుకోవాలని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి(Government Development), సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా వివరించి, చంద్రబాబు నాయుడు విజన్, నారా లోకేష్ కార్యాచరణను గ్రామస్థాయిలో బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిదని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తదితర పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply