Gold Rate Today | ప‌సిడి ప‌రుగులు!

Gold Rate Today | ప‌సిడి ప‌రుగులు!


Gold Rate| వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : బంగారం (gold) ఏ రోజుకారోజు ధ‌ర‌లు బ‌ట్టి కొనుగోలు చేసుకోవడం మంచిది. కానీ ధ‌ర త‌గ్గింద‌ని ఒక్క రోజు ఆల‌స్యం చేసినా… మ‌ళ్లీ భారీగా పెరిగే అవ‌కాశం ఉంటుంది. అమెరికా డాల‌ర్‌ (US dollar) తో ముడిప‌డి ఉన్న బంగారం ధ‌ర ఉద‌యం ఒక‌లా, సాయంత్రం ఒక‌లా ఉంటుంది. దీంతో బంగారు ప్రియులు కంగుతిన్నారు. నిన్న భారీగా తగ్గిన బంగారం (gold) ధరలు ఈ రోజు ఒక్కసారిగా మళ్లీ పెరిగిపోయాయి. బంగారం ధరలు తగ్గుతున్నాయని సంతోషించేలోపే.. మళ్లీ పెరిగాయి. ఈ రోజు ప‌ది గ్రాముల బంగారంపై 1200 రూపాయ‌లు పెరిగింది. నిన్న రూ.1600కు త‌గ్గిన విష‌యం విదిత‌మే.


నిన్న‌ 24 క్యారెట్ల ప‌ది గ్రాముల బంగారం (gold) ధర రూ.1,23,660 కాగా, ఈ రోజు 24 క్యారెట్ల ప‌ది గ్రాముల బంగారం ధర రూ.1,24,860 వద్ద ప‌లుకుతుంది. అంటే ప‌ది గ్రాముల ధ‌ర రూ.1200 పెరిగింది. ఈ రోజు 22 క్యారెట్ల ప‌ది గ్రామలు బంగారం ధర రూ.1,13,350 ఉండగా.. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,450 వద్ద పలుకుతోంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై ఒక్కసారిగా రూ. 1,200 పెరిగింది.

  • హైద‌రాబాద్‌లో 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,24,860 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,450 వద్ద ఉంది.
  • విశాఖ‌ప‌ట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,860 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,450 వద్ద ఉంది.
    విజ‌య‌వాడ‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,860 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,450 వద్ద ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,010 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,14,600 వద్ద ఉంది.


బంగారం ధరలకు తగ్గట్టు సిల్వర్ (Silver) ధరలు కూడా దూసుకెళ్తున్నాయి. నిన్న కిలో వెండి ధర రూ. 1,70,000 కాగా, ఈ రోజు వెండి ధర రూ. 1,73,000 వద్ద పలుకుతోంది. కిలో వెండిపై రూ.3,000 పెరిగింది.

Leave a Reply