KNL | సుపరిపాలన టీడీపీతోనే సాధ్యం.. మంత్రి టీజీ భరత్

కర్నూలు బ్యూరో, జూలై 2 (ఆంధ్రప్రభ) : కర్నూలు నగరంలోని 15వ వార్డులోని బుధవారపేటలో బుధవారం నిర్వహించిన సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ (Minister TG Bharat) పాల్గొన్నారు. ఆయనతో పాటు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు (Bastipati Nagaraju) ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు మంత్రి, ఎంపీ వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం విధ్వంసానికి గురైందన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను 90శాతం నెరవేర్చడంతో పాటు అనేక సంక్షేమ పథకాల (Welfare schemes)ను అమలు చేసిందని మంత్రి టీజీ పేర్కొన్నారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 90శాతం పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply