Gollapalli | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : గొల్లపల్లి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గోవిందుల జలపతి ప్రచారంలో జోరును పెంచుతున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తున్నారు. లక్ష్మీపూర్ గ్రామం సమగ్ర అభివృద్ధి చెందాలంటే మీ అమూల్యమైన ఓటు వేయాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను గోవిందల జలపతి అభ్యర్థించారు.
Gollapalli | ప్రచారంలో దూసుకెళ్తున్న గోవిందుల జలపతి

