AP | మంగళగిరిలో భారీ చోరీ – ఐదు కోట్లు విలువైన బంగారు ఆభరణాలు దోపిడీ

మంగళగిరి (గుంటూరు),ఆంధ్రప్రభ:మంగళగిరి ఒక్కసారిగా సంచలనానికి కేంద్ర బిందువుగా నిలిచింది. మంగళగిరిలోని ఆత్మకూరు అండర్ పాస్ వద్ద శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. సుమారు ఐదు కోట్లు విలువైన నాలుగు కిలోల 900 గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని దుండగులు చోరీ చేసి బైక్ పై పరారయ్యారు.

కాగా ఈ భారీ చోరీ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళగిరి ఆంజనేయ కాలనీలో ఉంటున్న దివి రాము అనే వ్యక్తి బంగారం వ్యాపారం చేస్తుంటాడు. అతనికి విజయవాడలోని జైహింద్ కాంప్లెక్స్ లో డివిఆర్ జువెలరీ షాప్ ఉంది. దివి రాము బంగారం కొని బంగారు ఆభరణాలు చేసి అమ్ముతుంటాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సుమారు పది గంటలకు మంగళగిరిలోనే ఉంటున్న రాము బంధువైన దివి నాగరాజు అనే వ్యక్తికి సుమారు 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఉంచిన బ్యాగును నాగరాజుకి ఇచ్చి తన ఇంటిలో ఇవ్వమని చెప్పాడు.

దివి రాముకు చెందిన జ్యువెలరీ షాపులో నాగరాజు పనిచేస్తుంటాడు.అండర్ పాస్ వద్ద దుండగుల చోరీ..నాగరాజు ఐదు కోట్లు విలువైన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగుతో స్కూటీపై పెట్టుకుని శనివారం రాత్రి సుమారు 9:40 గంటలకు ఆత్మకూరు అండర్ పాస్ కూడలి వద్ద కు చేరుకున్నాడు. అంతలో ఎక్కడి నుండో ఇద్దరు దుండగులు హెల్మెట్లు ధరించి స్కూటర్పై వచ్చి నాగరాజు వద్దనున్న ఆభరణాల బ్యాగు లాక్కుని పారిపోయారు.

పోలీసులకు ఫిర్యాదు దుండగులు ఆభరణాలు ఉన్న బ్యాగును లాక్కుని పారిపోవటంతో దివి నాగరాజు రాత్రి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు .దీనితో మంగళగిరి డిఎస్పి మురళీకృష్ణ, తాడేపల్లి మంగళగిరి రూరల్ సిఐలు కళ్యాణ్ రాజు, వై శ్రీనివాసరావు, రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ ,మరియు పోలీస్ సిబ్బంది భారీ చోరీ ఘటన జరిగిన ప్రదేశానికి వచ్చి విచారణ చేపట్టారు

.ఐదు కోట్లు విలువైన ఆభరణాలు స్కూటీ పైనా..? కాగా ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటన జరిగిన ప్రదేశం అత్యంత రద్దీగా ఉంటుంది. ఈ ఘటనపై పోలీసులు కూడా ఆరాతీస్తున్నారు. వాస్తవానికి ఐదు కోట్లు విలువ ఉన్న బంగారాన్ని ఆభరణాలను తగిన జాగ్రత్తలు తీసుకోకుండా కేవలం స్కూటీపై ఎందుకు పంపారు.? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

వాస్తవానికి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని కారులో ఇంటికి పంపిస్తుo టారు. మరి ఐదు కోట్లు విలువైన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును తన బంధువైన నాగరాజుకు స్కూటీపై ఎలా పంపించారు.? సరిగ్గా మంగళగిరి ప్రాంతానికి రాగానే గుర్తు తెలియని దుండగులు బైక్పై వచ్చి బ్యాగ్ లాక్కుని ఎలా పరారయ్యారు.? దీని వెనుక మర్మం ఏమిటి.? అన్న కోణం లో కూడా పోలీసులు విచారిస్తున్నారు.

షాపు నుండి బ్యాగు లో ఆభరణాలు పంపేటప్పుడు, ఎవరైనా గమనించి నాగరాజును ఫాలో అయ్యి వెంటపడి, ఆత్మకూరు అండర్ పాస్ రోడ్డు వద్దకు రాగానే బ్యాగ్ లాక్కొని పరారయ్యారా అనేది విచారణలో తేలవలసి ఉంది.ఫోన్ పరిశీలన..కాగా ఫిర్యాదు అయిన దివి నాగరాజు ఫోన్ను రూరల్ పోలీసులు తీసుకొని కాల్ డేటా పరిశీలిస్తున్నారు.

గత కొన్ని రోజుల నుండి అతను ఎవరెవరి కి ఫోన్లు చేశాడు అనేది ఆరాతీస్తున్నారు. ఈ భారీ చోరీ వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా అని ఆరాతీస్తున్నారు.

కాగా ఇటీవల తన ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న మంగళగిరి పట్టణ మహిళా కానిస్టేబుల్ భర్త దివి నాగరాజు కావటం ఈ సందర్భంగా కోస మెరుపు.

కాగా ఈ భారీ చోరీ ఘటనకు చేదించే పనిలో జిల్లా పోలీస్ అధికారులు, యంత్రాంగం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా త్వరలోనే ఈ భారీ చోరీ ఘటన వెనుక అసలు నిజాలు వెళ్ళడి కాగలవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *