భారత దేశ వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరుతోంది. బంగారం(gold)తోపాటు వెండి(silver) ధర కూడా భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు రూపాయి బలహీనపడడం వల్ల దిగుమతి ధరపై ప్రభావం చూపిస్తోంది. పండగలు, పెళ్లిళ్ల సీజన్(Wedding season) ఓవైపు.. బంగారం ధర ఇంకా పెరుగుతుందన్న వదంతుల వల్ల డిమాండ్ అమాంతం పెరిగిపోయి ధరలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలోనే.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న బంగారం, వెండికి సోమవారం బ్రేకులు పడ్డాయి. నేడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
24క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,08,350 రూపాయలకు చేరింది. పది గ్రాములపై రూ.110 వరకు ధర తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.100 మేర తగ్గి.. రూ.99,350గా ఉంది.
అదేవిధంగా వెండి కిలో ధర.. రూ.1000 మేర తగ్గి.. లక్షా 27వేల రూపాయలుగా ఉంది. కాగా.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,380 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.99,350 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,37,000 గా ఉంది.
విజయవాడ(Vijayawada), విశాఖపట్నం(Visakhapatnam)లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,380 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.99,350 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,37,000 గా ఉంది.
ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్ల బంగార ధర 1,08,530, 22 క్యారెట్ల ధర రూ.99,500లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,27,000లుగా ఉంది.
ముంబై(Mumbai)లో 24 క్యారెట్ల బంగార ధర 1,08,380, 22 క్యారెట్ల ధర రూ.99,350లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,27,000లుగా ఉంది.
చెన్నై(Chennai)లో 24క్యారెట్ల బంగారం ధర రూ.1,08,770 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.99,700గా ఉంది. వెండి కిలో ధర రూ.1,37,000 గా ఉంది.