కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం, వెండి ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయంగా పుత్తడి ధర భారీగా తగ్గింది. బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా తగ్గి సామాన్యుడికి కాస్త ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు ఇవాళ రూ.980లు తగ్గి రూ.90,660కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 900 తగ్గి రూ.83,100లు గా పలుకుతోంది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ రూ. 1,07,900కి చేరింది. కాగా, రెండ్రోజుల్లో తులం బంగారం రేటు రూ.2720 తగ్గడం విశేషం.
Gold prices | రూ.2720లు ధర తగ్గిన బంగారం..
