ప్రపంచ పారా ఆర్చరీలో స్వర్ణం!
హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారత ఆర్చర్ శీతల్ దేవి ప్రపంచ వేదికపై సంచలనం సృష్టించారు. కొరియా(Korea)లోని గ్వాంగ్జూలో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా ఛాంపియన్‌షిప్స్(Championships)లో ఆమె తన తొలి స్వర్ణ పతకాన్నికైవసం చేసుకున్నారు.
మహిళల కాంపౌండ్ ఓపెన్ ఫైనల్‌లో శీతల్, మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్ విజేత, అలాగే 2024 పారిస్ పారాలింపిక్స్(Paralympics) స్వర్ణ విజేత అయిన టర్కీకి చెందిన ఒజ్నూర్ కురే గిర్డీని 146-143 తేడాతో ఓడించి ఈ గొప్ప విజయాన్ని అందుకున్నారు.
ఫైనల్‌లో పోరాటం..
ఈ వ్యక్తిగత ఫైనల్ మ్యాచ్(Final Match) అత్యంత కఠినంగా సాగింది. తొలి ఎండ్‌లో ఇద్దరూ 29-29తో సమంగా నిలిచారు. అయితే, రెండో ఎండ్‌లో శీతల్ మూడు పర్ఫెక్ట్ 10 పాయింట్ల బాణాలను గురిపెట్టి, 30-27తో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు.
మూడో ఎండ్ మళ్ళీ 29-29తో టై అవ్వగా, నాలుగో ఎండ్‌లో గిర్డీ 29 పాయింట్లు సాధించారు, శీతల్ 28 పాయింట్లు మాత్రమే సాధించారు. అయినప్పటికీ, శీతల్ మొత్తం స్కోర్ 116-114తో రెండు పాయింట్ల ముందంజలో ఉన్నారు.
నిర్ణయాత్మక చివరి ఎండ్‌లో శీతల్ దేవి ఏకాగ్రత చెదరనీయకుండా మూడు పర్ఫెక్ట్(Perfect) 10 పాయింట్ల బాణాలను సంధించి, స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకున్నారు.
ఒకే రోజు మూడు పతకాలు !!
శీతల్ దేవి ఈ రోజున భారతానికి మూడో పతకాలను చేర్చడం విశేషంగా నిలిచింది. మహిళల కాంపౌండ్ ఓపెన్ వ్యక్తిగత ఈవెంట్ లో తన అద్భుత ప్రదర్శనతో శీతల్ స్వర్ణ పతకం గెలుచుకున్నారు. మహిళల కాంపౌండ్ ఓపెన్ టీమ్(Open Team) ఈవెంట్‌లో సరితాతో జట్టుగా పాల్గొని రజత పతకాన్ని సాధించారు. మిక్స్‌డ్ టీమ్ ఓపెన్ ఈవెంట్‌లో టోమన్ కుమార్ తో కలిసి శీతల్ బ్రిటన్(Sheetal Britain) ఆటగాళ్లను ఓడించి కాంస్యం (బ్రోంజ్) పతకం కూడా సాధించారు. ఈ విజయాలతో శీతల్ దేవి భారత ప్యారాలింపిక్ రీతిలో ఒక గొప్ప రికార్డు నెలకొల్పారు.
ఇతర ఫలితం
ఇదిలా ఉండగా, మరో మ్యాచ్‌లో శ్యామ్ సుందర్ స్వామి(Shyam Sundar Swamy) 141-148 తేడాతో బ్రిటన్ పారాలింపిక్ గోల్డ్ మెడల్(Gold Medal) విజేత నాథన్ మాక్‌క్వీన్ చేతిలో ఓటమి పాలయ్యారు.