gold| కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్‌

గోల్డ్, సిల్వ‌ర్‌ రేట్ డౌన్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బంగారం కొనాల‌నుకునేవారికి గుడ్ న్యూస్‌. వ‌రుస‌గా మూడో రోజుల నుంచి గోల్డ్ రేటు త‌గ్గుతూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ ఉండ‌టంతో బంగారం కొనుగోలు చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ నేప‌థ్యంలో వివాహాది శుభ‌కార్యాలు జ‌రిపించేవారు జ్యువెల‌రీ షాపుల వ‌ద్ద‌కు ప‌రుగెడుతున్నారు. ఆ దుకాణాలు కొనుగోలుదారుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. మ‌ళ్లీ ఎక్క‌డ ధ‌ర పెరుగుతుందోన‌ని కొంద‌రు ముందే కొని పెట్టుకుంటున్నారు.

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న వేళ భారతదేశంలో బంగారం, వెండి రేట్లు క్రమంగా పడిపోతున్నాయి. రాబోయే వారం రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచనా వేస్తున్నారు. శనివారం ఉదయం గోల్డ్ రేట్లు ఇలా ఉన్నాయి. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.1,030 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 950 తగ్గింది. దీంతో గడిచిన మూడు రోజుల్లో తులం గోల్డ్ పై రూ.3,600 తగ్గింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండిపై రూ. 10వేలు తగ్గింది. దీంతో గడిచిన మూడు రోజుల్లో కిలో వెండిపై రూ. 20వేలు తగ్గిన‌ట్ల‌య్యింది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో భారీ మార్పులు జ‌రిగాయి. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,660కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,46,350 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,59,810 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,46,500 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,59,660కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,46,350 వద్దకు చేరింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,59,660 కాగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,46,350 వద్దకు చేరింది.

వెండి ధరలో ఇవాళ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,80,000 వద్ద చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,70,000వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,80,000 వద్దకు పడిపోయింది.

Leave a Reply