ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశీయంగా బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది (Gold prices). డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్3న) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1, 04, 940కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 96, 190కి చేరింది (Gold and Silver Rates).
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1, 06, 250కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 97, 410కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 06, 100కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 97, 260కి చేరింది. వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే వంద రూపాయల మేర పెరిగాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు..
హైదరాబాద్‌లో రూ. 1, 06, 100, రూ. 97, 260
విజయవాడలో రూ. 1, 06, 100, రూ. 97, 260
ఢిల్లీలో రూ. 1, 06, 410, రూ. 97, 410
ముంబైలో రూ. 1, 06, 100, రూ. 97, 260