Godavari River | గోదావరిలో ప్రమాదవశాత్తు పడి ఒక్కరి మృతి

Godavari River | గోదావరిలో ప్రమాదవశాత్తు పడి ఒక్కరి మృతి

Godavari River | జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తిమ్మాపూర్ కు చెందిన కుందారపు లక్ష్మీనారాయణ(54) గ్రామ సమీపాన ఉన్న గోదావరి నదిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందగా, ఈ రోజు సాయంత్రం మృతదేహాన్ని కనుగొని గ్రామానికి చెందిన కొందరు నది ఒడ్డుకు చేర్చారు.

అతను తన చిన్న నాన్న కుందారపు చంద్రయ్య(Kundarapu Chandrayya)తో కలిసి జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం జైనలోని బంధువుల ఇంట్లో జరిగిన కర్మకాండకు గోదావరినది గుండా కాలినడకన వెళ్లి అదే మార్గంలో తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు నదిలోని నీటి మడుగులో పడి మృతి చెందాడు. అతని మృతదేహాన్ని సాయంత్రం గోదావరి నది(Godavari River) నీటిమడుగులో గ్రామానికి చెందిన కొందరుకనుగొని నది ఒడ్డుకు చేర్చారు.

Godavari River |

మృతునికి భార్య పుష్పలతతో పాటు ఇద్దరు కుమారులు వెంకటచారి, రాజ్ కుమార్ ఉన్నారు. మృతదేహం వద్ద భార్య, కుమారులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. స్థానిక ఏఎస్సై రాథోడ్ ఉమేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply