నక్కలపేట్ సర్పంచ్‌గా అవకాశం కల్పించండి..

ధర్మపురి, ఆంధ్రప్రభ : నక్కలపేట్ గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న నల్ల మల్లవ్వ, గ్రామ ప్రజలు తనకు అవకాశం కల్పించాలని కోరారు. లేడీ పర్స్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో గ్రామానికి అత్యధిక నిధులు తీసుకురావడమే కాకుండా మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
గతంలో సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం ఉన్నందున, తాను మరింత సమర్థంగా గ్రామాభివృద్ధికి కృషి చేయగలనని ప్రజలకు వివరించారు. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని మల్లవ్వ భరోసా ఇచ్చారు.
