- అభ్యర్థి కరపత్రం ఆవిష్కరణ
ధర్మపురి, ఆంధ్రప్రభ: నేరేళ్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థి జాజాల రమేష్ శనివారం తన కరపత్రాన్ని ఆవిష్కరించారు. గత 15 సంవత్సరాలుగా నేరేళ్ల గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, ప్రభుత్వాల నుండి పొందిన సంక్షేమ పథకాలను గ్రామస్తుల లాభానికి ఉపయోగిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే, విద్యార్థుల కోసం చేసిన పోరాటాలు, మరిన్ని ముఖ్యమైన సమస్యలను సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు.

