గీతా జయంతి… భగవద్గీత కంఠస్థ పోటీలు

గీతా జయంతి… భగవద్గీత కంఠస్థ పోటీలు


మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈనెల 16న గీతా జయంతి సందర్భంగా విద్యార్థులకు 5 స్థాయిల్లో భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించనున్నట్లు వి హెచ్ పి ప్రఖండ అధ్యక్షులు కె.సత్యనారాయణ గౌడ్ (K.Satyanarayana Goud), బజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక్ భీమేష్ తెలిపారు. శనివారం పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద వారు మాట్లాడుతూ మక్తల్,మాగనూరు, కృష్ణ మండలాలకు సంబంధించిన వివిధ ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు.

విద్యార్థులు (students) భగవద్గీతలోని 6వ అధ్యాయం – ఆత్మ సన్యాసయోగంలోని శ్లోకాలు కంఠస్థంగా చెప్పవలసి ఉంటుందన్నారు. ప్రతి పాఠశాల/ కళాశాల నుండి ప్రతి స్థాయిలో ఇద్దరు విద్యార్థులు మాత్రమే పాల్గొనవలసి ఉంటుందన్నారు. విద్యార్థులను ఆయా పాఠశాల,కళాశాల ఉపాధ్యాయులు తమ వెంట తీసుకొని రావాలన్నారు.శిశు స్థాయిలో – పూర్వశిశు, 1 వ , 2 వ తరగతి విద్యార్థులు 1 వ శ్లోకం నుండి 5 వ శ్లోకం వరకు, ప్రాథమిక స్థాయిలో – 3,4, 5 వ తరగతి విద్యార్థులు 1వ శ్లోకం నుండి 10 వ శ్లోకం వరకు కంఠస్థంగా చెప్పవలసి ఉంటుందని అన్నారు. మాధ్యమిక స్థాయిలో 6,7 వ తరగతి విద్యార్థులు 1వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు, ఉన్నత స్థాయిలో 8,9,10వ తరగతి విద్యార్థులు 1 వ శ్లోకం నుండి 29వ శ్లోకం వరకు, కళాశాల స్థాయిలో- ఇంటర్ ఆపై స్థాయి విద్యార్థులు 1వ శ్లోకం నుండి 29వ శ్లోకం వరకు విద్యార్థులు శ్లోకాలను కంఠస్థంగా చెప్పవలసి ఉంటుందన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే వారు 9966703040, 8019249123, 9182689206, 8520026647 మొబైల్ నెంబర్లను సంప్రదించాల్సిందిగా వారు సూచించారు.

భగవద్గీత కంఠస్థ పోటీలు మక్తల్ పట్టణంలోని శ్రీ షిరిడి సాయి- సత్య సాయి మందిరము రాయచూరు రోడ్డులో ఈనెల16న ఆది వారం రోజు ఉదయము 9:30 గంటలకు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ పోటీలలో మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాలకు సంబంధించిన వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు పాల్గొనాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ పట్టణ కార్యదర్శి మల్లికార్జున్,బజరంగ్ దళ్ ప్రఖండ సంయోజక్ రాహుల్,సప్తాయి క్ మిలన్ సంయోజక్ పారశురాం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply