ICC ODI Rankings | నంబర్ వన్ బ్యాటర్ గా గిల్ !
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ఈ యువ బ్యాటర్.. పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో గిల్ 796 రేటింగ్ పాయింట్లతో నంబర్ వన్ ర్యాంక్‌కు చేరుకోగా, బాబర్ 773 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. కాగా, గిల్ వన్డే క్రికెట్ లో నంబర్ వన్ ర్యాంకింగ్ ను దక్కించుకోవడం ఇది రెండోసారి.
టాప్-10లో మరో ముగ్గురు…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (761) మూడో స్థానంలో నిలవగా… విరాట్ కోహ్లీ (727) ఆరో ర్యాంక్ కు దక్కించుకున్నాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ ఒక ర్యాంక్ (679) మెరుగుపరుచుకుని తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు.