Gifts | యువత విద్యార్థులకు క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు

Gifts | యువత విద్యార్థులకు క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
Gifts | ఊట్కూర్, ఆంధ్రప్రభ : యువత విద్యార్థులకు క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉందని అవుసలోనిపల్లి సర్పంచ్ దాసరి ఎల్లమ్మ, తిమ్మయ్య, ఊట్కూర్ ఎస్సై రమేష్ అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని అవుసలోనిపల్లిలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిత్యం క్రీడలు వాడడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటుతూ గెలుపోటములను సమానంగా స్వీకరించాలని అన్నారు. నిజమైన ఆరోగ్యవంతులు క్రీడాకారులేనని కబడ్డీ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
క్రీడలు మానసిక ఉల్లాసం తో పాటు శారీరక దృఢత్వం స్నేహభావాన్ని పెంపొందిస్తాయనిఅన్నారు. జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రథమ బహుమతి అవుసలోనిపల్లి రాకెట్స్ టీం గెలుపొందగా రూ20116, ఎడవెల్లి టీం ద్వితీయ బహుమతి సాధించగా రూ10116 నగదు అందజేసిఅభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెన్నప్ప మాజీ సర్పంచ్ లు వెంకటయ్య, శివరాములు, మాజీ ఎంపీటీసీలు భీమమ్మ, అశోక్, వార్డు సభ్యులు ప్రకాష్, భగవంతమ్మ, తిమ్మమ్మ సునీత చంద్రములు, ఆర్గనైజర్లు శ్రీకాంత్ కృష్ణ శ్రీనివాస్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
