గాలికుంటు వ్యాధి టీకాలు వేయించాలి..

గాలికుంటు వ్యాధి టీకాలు వేయించాలి..

కడెం, ఆంధ్రప్రభ
పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయించుకోవాలని నిర్మల్ జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ యమ్. బాలిక్ అహమద్ కోరారు. గురువారం కడెం మండలంలోని కొండూ కూర్ గ్రామము లో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరంను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులకు గాలి కుంటు వ్యాధి టీకాలు వేయించుకోవాలని.. గ్రామాల్లో నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి ఉచిత శిబిరాలను రైతులు పశువుల యజమానులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిబిరంలో గ్రామానికి చెందిన పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పశు వైద్య సిబ్బంది వేశారు. ఈ కార్యక్రమంలో కడెం మండల పశువైద్యాధికారి డాక్టర్ సౌందర్య, క జెసి ఓ రాజేశ్వర్, ఎల్ ఎస్ ఏ లు, విజయ హరీష్, గోపాల మిత్ర సిబ్బంది బి రమేష్, రాజేశ్వర్, మదన్, మల్లేష్, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Leave a Reply