జనరల్ సర్జన్, ఆయన కుమార్తె మృతి

  • భార్య సహా మరో ముగ్గురు పిల్లల పరిస్థితి విషమం
  • చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం


చిలకలూరిపేట (ఆంధ్రప్రభ) : అతి వేగం ఆయన ప్రాణాలు తీసింది. కుమార్తెను చంపేసింది. ఇక భార్య సహా ముగ్గురు పిల్లల పరిస్థితి విషమమం కావటంతో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరులో ఓ శుభకార్యానికి బయలుదేరిని ఈ కుటుంబాన్ని మృత్యువు వెంటాడి వేటాడింది. చెన్నై- కలకత్తా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (road accident) లో తండ్రీ కూతురు దుర్మరణం చెందారు.

చిలకలూరిపేట (Chilakaluripet) రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. తిరుపతికి చెందిన జనరల్ సర్జన్ డాక్టర్ కేదర వెంకట కిషోర్ (42), అక్కడికక్కడే మృతి చెందగా ఆయన కుమార్తె అశ్విత (7) ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ మండలం తాతపూడి గ్రామం బైపాస్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు డాక్టర్ కేదర వెంకట కిషోర్ భార్య తంగిళ్ళ సంధ్య మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ తంగిళ్ళ సంధ్య తోపాటు ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ కుటుంబంతో మృతుడు డాక్టర్ కేదర వెంకట కిషోర్ (Dr. Kedar Venkata Kishore) చెల్లెలు డాక్టర్ అన్నా శ్వేతతో పాటు ఏడుగురు ఈ కారులో ప్రయాణిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది, డాక్టర్ కేదర వెంకట కిషోర్ తన Mahindra XUV 7 సీటర్ (AP 40 BJ 0012) కారులో గుంటూరులో బంధువుల ఫంక్షన్ ఉండడంతో తిరుపతి నుండి గుంటూరుకు బయలుదేరారు. కారును డాక్టర్ అతివేగంగా నడుపుతూ, అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న డాక్టర్ కేదర వెంకట కిషోర్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆయన కుమార్తె అశ్వితను హుటాహుటిన గుంటూరులోని రమేష్ హాస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. డాక్టర్ భార్య తంగిళ్ళ సంధ్య మిగిలిన ముగ్గురు పిల్లలు ప్రస్తుతం చిలకలూరిపేటలోని కందిమళ్ళ హాస్పిటల్‌లో చికిత్స పొందారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన చికిత్స కొరకు గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. రూరల్ పోలీసులకు అన్నా శ్వేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply