గ్యాస్ కోసం బారులు..పండుగ పూట ప్రజల తిప్పలు

గ్యాస్ కోసం బారులు..పండుగ పూట ప్రజల తిప్పలు

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ లో గ్యాస్ కోసం బుధవారం ఉదయం భారత్ గ్యాస్ కార్యాలయం తీయక ముందే వినియోగదారులు పెద్ద ఎత్తున క్యూ లైన్ లో నిల్చున్నారు.బుధవారం 500 సిలిండర్ల స్టాక్ గోదాం కి వచ్చినట్లు గోదాం ఇంచార్జ్ యాదగిరి తెలిపారు. గ్యాస్ కార్యాలయం లో లైన్ లో నిల్చొని రశీదులు పొందిన వినియోగదారులు మార్కెట్ యార్డ్ లో గోదాం వద్ద సైతం మళ్లీ క్యూ లో నిల్చొని సిలిండర్ తీసుకురావాల్సిన పరిస్థితి ఉండడంతో కేవలం ఒక్క సిలిండర్ కోసం గంటల తరబడి క్యూలో నిల్చొని తీసుకోవడం పట్ల తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఉగాది పండుగ కావడంతో ఇంట్లో వంటలకు మహిళలు ఇబ్బందులు పడకూడదని తిప్పలు పడి మరీ గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్లారు.

Leave a Reply