Cylinder | సోమాన్య టైల్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ పేలుడు

Cylinder | సోమాన్య టైల్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ పేలుడు

Cylinder | కాళహస్తి, ఆంధ్ర‌ప్ర‌భ : కాళహస్తి మండలం వాంపల్లి సమీపంలో సోమన్య టైల్స్ ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం 11 గంటలకు గ్యాస్ పేల‌డంతో కార్మికులు గున్నాటి పోతురాజు, చీరాల పండ అక్క‌డిక‌క్క‌డ చనిపోయారు. వడ్లమూడి బాలాజీ (Vadlamudi Balaji) చంద్రగిరి, సౌభాగ్యనాయక్ తీవ్ర గాయాలయ్యాయి . వీరంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన‌వారుగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఈ పరిశ్రమలో 500 మంది పనిచేస్తున్నారు. ఈ పేలుడు జరిగిన ప్రదేశంలో సుమారు పదిమంది ఉన్నారు. గ్యాస్ సిలిండర్లను ఏర్పాటు చేసి ఫైరింగ్ టెస్టింగ్ చేసేటప్పుడు గ్యాస్ పేలడంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న నలుగురిలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమీపంలో ఉన్న మిగిలిన వారు కొంత దూరంగా ఉండటం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ గ్యాస్ సిలిండర్ 10 టన్నుల బ‌రువు ఉంటాయి. ఒక‌ సిలిండర్ పేలడం వల్ల చిన్న నష్టంతో పోయింది. అన్ని పేలి ఉంటే ఘోరం జ‌రిగేది. అయితే ఫ్యాక్టరీలో సిబ్బంది సిమెంట్ పని చేస్తుండగా ఈ ప్రమాదం జ‌రిగింది.

Leave a Reply