Gandhi Statue | మనసేవ సమితి ఆధ్వర్యంలో అన్న ప్రసాదం….
Gandhi Statue | బిస్కనూర్, ఆంధ్ర ప్రభ : మండల కేంద్రంలో మన సేవా సమితి(Mana Seva Samiti ఆధ్వర్యంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మన సేవా సమితి ప్రతినిధులు తెలిపారు.
అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. స్థానిక గాంధీ విగ్రహం(Gandhi Statue) వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న ప్రసాద కార్యక్రమంలో పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్న ప్రసాదానికి విరాళాలు(donations) ఇచ్చే దాతలు ముందుకు రావాలని వారు కోరారు.

