Gandhari | తిరువాభరణ సేవలో పాల్గొన్న గాంధారి భక్తులు..

Gandhari | తిరువాభరణ సేవలో పాల్గొన్న గాంధారి భక్తులు..
Gandhari | గాంధారి, ఆంధ్రప్రభ : శబరిమల అయ్యప్ప స్వామికి అలంకరించే తిరువాభరణ సేవలో కామారెడ్డి జిల్లా, గాంధారి మండల కేంద్రానికి చెందిన పలువురికి అవకాశం లభించింది. గాంధారి మండల కేంద్రానికి చెందిన కులకర్ణి చక్రధర్, అంజాగౌడ్ స్వామి, కొక్కొండ మహేశ్వర్, రాజేశ్వర్ లకు తిరువాభరణ సేవలో పాల్గొనే అవకాశం కల్గిందని తెలిపారు. ప్రతి సంవత్సరం జనవరి 12వ తేదీ నుంచి 14వ తేది వరకు తిరువాభరణ పాదయాత్ర కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున శబరిమల అయ్యప్ప మకర సంక్రాంతి రోజున మూడు సార్లు జ్యోతి రూపంలో దర్శనం ఇస్తారు. అంతకు ముందు పందలం రాజ్యం నుంచి అయ్యప్ప తిరువాభరణాలను సుమారు 80 కిలోమీటర్ల దూరం నుంచి కాలినడకన శబరిమల తీసుకోని వచ్చి ఆభరణాలను స్వామి వారికి అలంకరిస్తారు.
ఈ పాదయాత్రలో పందల రాజ వంశీయులతో పాటు ప్రతి సంవత్సరం కొందరికి అవకాశం కల్పిస్తారు. ఈ సంవత్సరం దాదాపు 4000 వేల మందికి మాత్రమే, దేవస్థానం బోర్డు అవకాశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా వేలమంది దరఖాస్తులు చేసుకోగా, అందులో కామారెడ్డి శ్రీ శాస్త అన్నదాన ట్రస్ట్ సభ్యులైన నలుగురికి అదృష్ట్రం వరించింది. ఈ సందర్భంగా తిరువాభరణ సేవలో పాల్గొన్న భక్తులు చక్రధర్, అంజాగౌడ్ స్వామి, మహేశ్వర్, రాజేశ్వర్ మాట్లాడుతూ… ఎన్నో జన్మల పుణ్యఫలం కారణంగా ఈ అవకాశం లభించినట్లు తెలిపారు. తిరువాభరణ సేవలో పాల్గొనేల ప్రోత్సహించిన, పందల రాజు వారితో స్వయంగా మాట్లాడిన నాచారం పిఠాదీపతి శ్రీ శ్రీ శ్రీ మధుసూధానానంద సరస్వతి స్వామికి, శ్రీ శాస్త అన్నదాన సేవా సమితి ట్రస్ట్ అధ్యక్షుడు గుడిపాటి చంద్రశేఖర్ శర్మ గురు స్వామికి ధన్యవాదాలు తెలిపారు.
