Games | యువకుడు బలి…

Games | యువకుడు బలి…
Games | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దని, వాటికి దూరంగా ఉండాలంటూ ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నా… జనాల్లో మార్పు రావడంలేదు. ఆన్ లైన్ గేమ్స్ కి అలవాటు పడి అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
తాజాగా.. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లాలో ఆన్ లైన్ బెట్టింగ్ కు యువకుడు బలయ్యాడు. చౌటుప్పల్ మండలం తంగేడుపల్లిలో బాలగోని పవన్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పవన్ ఆన్ లైన్ బెట్టింగ్ కోసం రూ.లక్షలు అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
