వాషింగ్టన్ డిసి : ఇరాన్ పై దాడికి దిగిన ఇజ్రాయెల్ (Israel) కు జీ7 దేశాలు మద్దతు ప్రకటించాయి.. కెనడా (Canada) లో జరిగిన జి 7 దేశాల సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించాయి.. అనంతరం ఈ దేశాలు ఒక సంయుక్త ప్రటనను విడుదల చేశాయి.. దాడులను వెంటనే ఇరాన్ విరమించుకోవాలని కోరాయి. ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని ఆ దేశాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. ప్రాంతీయ అస్థిరత, ఉగ్రవాదానికి ఇరాన్ కారణమని పేర్కొన్నాయి. యుద్ధ ప్రభావం (War Effect) అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ఉంటుందని, దీంతో అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని జీ-7 దేశాలు హెచ్చరించాయి.
Support for Israel | ఇజ్రాయెల్ కు మద్దతు ప్రకటించిన జీ7 దేశాలు..
